రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం.
రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ (NSS) ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 11న నిర్వహించే జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ సి. జగదీష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ కీలక పాత్ర పోషించారని, స్వాతంత్ర్యం అనంతరం దేశంలో ఆధునిక విద్యావ్యవస్థకు బలమైన పునాదులు వేశారని పేర్కొన్నారు. విద్య అందరికీ అందుబాటులో ఉండాలన్న ఆయన ఆశయాలు నేటికీ ఆదర్శప్రాయమని తెలిపారు. విద్య ద్వారానే వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని, విద్యార్థులు ఆజాద్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని పిలుపునిచ్చారు.అనంతరం మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు అశోక్ కుమార్, అశోక్ రెడ్డితో పాటు అధ్యాపకులు ప్రసూన దేవి, పున్నారావు, మాలే వెంకట్ రెడ్డి, మందడి వెంకట్ రెడ్డి, కిరణ్, నరసింహారావు, నిర్మల, రాజేశ్వరి, శ్రీకాంత్, ఉపేందర్ రావు, కరుణ, నాగమణి, పరశురాం తదితరులు, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి