Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన సర్పంచుల సంఘం నాయకులు.

Updated : 11 Nov 2026 16:35 IST
As Preferred Source 1 min read
కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన సర్పంచుల సంఘం నాయకులు.

స్థానికం ప్రతినిధి:

భువనగిరి నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గ్రామసభల ద్వారానే ఎంపిక చేయాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ సర్పంచుల సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, భువనగిరి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జక్క రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, జిల్లా హౌసింగ్ పీడీకి వినతిపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భువనగిరి నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో సర్పంచ్‌లను, గ్రామపంచాయతీ పాలకవర్గాలను సంప్రదించకుండానే అధికారులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు. అనర్హులకు సైతం లబ్ధిదారుల జాబితాలో చోటు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే రూపొందించిన జాబితాలను రద్దు చేసి, సర్పంచుల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేయాలని కోరారు. సర్పంచుల గౌరవానికి, రాజ్యాంగబద్ధమైన హక్కులకు భంగం కలిగిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో వలిగొండ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు పనుమటి మమత నరేందర్ రెడ్డి, తొక్కాపురం సర్పంచ్ జనగాం పాండు, నమాత్‌పల్లి సర్పంచ్ అతికం అరుణ లక్ష్మీనారాయణ గౌడ్, తాజ్‌పూర్ సర్పంచ్ ర్యాకల సంతోష్ శ్రీనివాస్, బొల్లేపల్లి సర్పంచ్ గోద అరుణ శ్రీనివాస్ గౌడ్, బండసోమారం సర్పంచ్ కటికే జంగయ్య, నందనం సర్పంచ్ నాగెల్లి గిరిజ రమేష్ గౌడ్, సూర్యపల్లి సర్పంచ్ సత్యనారాయణ గౌడ్, నెమలికాల్వ సర్పంచ్ బి. సునీత, చందుపట్ల సర్పంచ్ కంకల కిష్టయ్య, కేసారం సర్పంచ్ కమ్మగాని మంజుల నర్సింహ గౌడ్, లింగారెడ్డిపల్లి సర్పంచ్ బోడిగె లింగస్వామి, సంగ్యం సర్పంచ్ తరిమి లలిత, వెంకటాపురం సర్పంచ్ బత్తుల కళమ్మ, జాలుకాలువ సర్పంచ్ మద్దెల మంజుల సందీప్, నాతాళ్లగూడెం సర్పంచ్ లింగస్వామి, వర్కట్‌పల్లి సర్పంచ్ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన సర్పంచుల సంఘం నాయకులు.

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి