Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

మూడేళ్లుగా అసంపూర్తిగానే డ్రైనేజీ పనులు!. కాలనీవాసులతో కలిసి రోడ్డుపై బైఠాయించిన మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి.

Updated : 11 Nov 2026 14:36 IST
As Preferred Source 1 min read
మూడేళ్లుగా అసంపూర్తిగానే డ్రైనేజీ పనులు!.  కాలనీవాసులతో కలిసి రోడ్డుపై బైఠాయించిన మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి.

స్థానికం ప్రతినిధి, హయత్‌నగర్:

మంజూరైన నిధులు ఉన్నప్పటికీ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని ముదిరాజ్ కాలనీ నుంచి మునుగనూర్ కల్వర్టు వరకు చేపట్టాల్సిన డ్రైనేజీ ట్రంక్‌లైన్ పనులు మూడేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయాయి. మూడు విడతల్లో పూర్తి చేయాల్సిన పనులు మధ్యలోనే ఆగిపోవడంతో ముదిరాజ్ కాలనీ, లక్ష్మీప్రియ కాలనీ, దుర్గానగర్, శివాజీనగర్‌తో పాటు పరిసర కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ఈ సమస్యపై స్పందించిన హయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి కాలనీవాసులతో కలిసి నిలిచిపోయిన డ్రైనేజీ పనులను పరిశీలించారు. స్థానికుల సమస్యలను తెలుసుకున్న అనంతరం జైస్వాల్ ఫర్నిచర్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల అవసరాల కోసం నిధులు మంజూరైనా పనులు పూర్తి చేయడంలో జాప్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. మూడేళ్లుగా పనులు నిలిచిపోయినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

అభివృద్ధి పనులు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పూర్తికావాలని, నిలిచిపోయిన డ్రైనేజీ పనులను వెంటనే పునఃప్రారంభించి మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కాలనీవాసుల సమస్యలను పరిష్కరించే వరకు ప్రజలతో కలిసి పోరాటం కొనసాగిస్తామని తెలిపారు..

ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు గంగాని శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఇట్టబోయిన నర్సింహ, నాయకులు జనార్దన్, జంగారెడ్డి, వివిధ కాలనీల అధ్యక్షులు, కాలనీ సంక్షేమ సంఘాల సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి