Sthanikam - Truth Matters
Logo

నెల రోజులైనా కొనుగోలు చేయరా?

Updated : 11 Nov 2026 16:20 IST
As Preferred Source 1 min read
నెల రోజులైనా కొనుగోలు చేయరా?

వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ఆందోళన.. రైతు వేదికకు తాళం.

వెలిమినేడు: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ధర్నా నిర్వహించారు.

వరి కోతలు కోసి ధాన్యాన్ని కల్లాల్లో పోసి నెల రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ధాన్యం కల్లాల్లోనే ఉండటంతో వర్షాలకు తడిసి నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రైవేట్ వ్యాపారులు మంచి ధరకు ధాన్యం కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నా, వారికి అమ్ముకునే అవకాశం లేకుండా చేస్తున్నారని రైతులు ఆరోపించారు.

ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు.. ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకునే పరిస్థితి లేదు.. దీంతో తాము ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించే వరకు రైతు వేదికను తెరవకూడదంటూ తాళం వేశారు. అనంతరం ధాన్యం కల్లాల్లోనే కూర్చొని నిరసన తెలిపారు.

అధికారులు వెంటనే స్పందించి ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని, రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.

Sthanikam

నెల రోజులైనా కొనుగోలు చేయరా?

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి