Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

ట్రినిటీ హైస్కూల్‌లో ముందస్తు బాలల దినోత్సవ సంబరాలు

Updated : 13 Nov 2026 18:43 IST
As Preferred Source 1 min read
ట్రినిటీ హైస్కూల్‌లో ముందస్తు బాలల దినోత్సవ సంబరాలు

​ఆకట్టుకున్న చిన్నారుల విభిన్న వేషధారణలు

నెహ్రూ ఆశయాలను వివరించిన ప్రిన్సిపాల్ డాక్టర్ ఉజ్జిని మంజుల

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ట్రినిటీ హైస్కూల్ (ఐఐటీ జోన్)లో శుక్రవారం ముందస్తు బాలల దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు వివిధ రకాల ఆకర్షణీయమైన వేషధారణలతో పాఠశాలకు విచ్చేసి తోటి విద్యార్థులను, ఉపాధ్యాయులను ఎంతగానో అలరించారు.​కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాఠశాల డైరెక్టర్ కం ప్రిన్సిపాల్ డాక్టర్ ఉజ్జిని మంజుల మాట్లాడుతూ.. భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు. నెహ్రూజీకి పిల్లలంటే అమితమైన ప్రేమ ఉండేదని గుర్తుచేశారు. విద్యార్థులు బాల్యం నుంచే క్రమశిక్షణతో మెలగాలని, కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఆసక్తి చూపాలని సూచించారు. సమాజంలోని మంచి చెడులను విచక్షణతో గ్రహించి, భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనేలా ఎదగాలని ఆమె విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.​ఈ వేడుకల్లో పాఠశాల చైర్మన్ కేవీబీ కృష్ణారావు, ఐఐటీ ఇన్‌ఛార్జ్ అనూష, ప్రీ-ప్రైమరీ ఇన్‌ఛార్జ్ చందన, ఉపాధ్యాయులు జ్యోతి, శిరీష, ధనలక్ష్మి, హారిక, భార్గవి, లావణ్య, సింధు, విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Sthanikam

ట్రినిటీ హైస్కూల్‌లో ముందస్తు బాలల దినోత్సవ సంబరాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి