Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

సెయింట్ ఎలిజబెత్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

Updated : 13 Nov 2026 18:46 IST
As Preferred Source 1 min read
సెయింట్ ఎలిజబెత్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

ఆటపాటలతో సందడి చేసిన చిన్నారులు!

ఆకట్టుకున్న నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు

భువనగిరి టౌన్, నవంబర్ 13: స్థానికం ప్రతినిధి

చిరునవ్వులు.. చిందులు.. ఆటపాటలు.. చిన్నారుల కేరింతలతో సెయింట్ ఎలిజబెత్ కాన్వెంట్ (ఈ.ఎం.) హైస్కూల్‌లో బాలల దినోత్సవ వేడుకలు సందడిగా సాగాయి. భువనగిరి పట్టణంలోని పాఠశాలలో శుక్రవారం ప్రీ-ప్రైమరీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఈ వేడుకల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

వివిధ పాటలకు అనుగుణంగా చిన్నారులు చేసిన నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వేదికపై చిన్నారులు ప్రదర్శించిన ప్రతిభ, ఆత్మవిశ్వాసం అందరినీ అలరించాయి. వారి ఆటపాటలతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది.

సృజనాత్మకతకు ప్రోత్సాహం

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రెవ. సిస్టర్ లాలీ మాట్లాడుతూ.. చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థుల ప్రదర్శనలను అభినందిస్తూ, వారు చదువుతో పాటు ఇతర రంగాల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సిస్టర్ చైతన్య, ప్రీ-ప్రైమరీ ఇన్‌ఛార్జ్ సిస్టర్ ఎడిత్ గ్రేస్, సిస్టర్స్, ప్రీ-ప్రైమరీ ఉపాధ్యాయినులు, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వేడుకలను విజయవంతం చేసిన ఉపాధ్యాయ బృందాన్ని పాఠశాల యాజమాన్యం అభినందించింది.

Sthanikam

సెయింట్ ఎలిజబెత్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి