Sthanikam - Truth Matters
Logo

సజ్జనార్‌పై మాజీ ఐపీఎస్ నాగేశ్వరరావు తీవ్ర వ్యాఖ్యలు.. సమగ్ర విచారణకు డిమాండ్

Updated : 13 Nov 2026 18:15 IST
As Preferred Source 1 min read
సజ్జనార్‌పై మాజీ ఐపీఎస్ నాగేశ్వరరావు తీవ్ర వ్యాఖ్యలు.. సమగ్ర విచారణకు డిమాండ్

హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్‌ను మరో పోస్టుకు బదిలీ చేయడంపై మాజీ ఐపీఎస్ అధికారి నాగేశ్వరరావు స్పందించారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్‌కు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ధన్యవాదాలు తెలిపారు.సజ్జనార్‌ను పోలీస్ యూనిఫాంలో ఉన్న నేరస్థుడిగా అభివర్ణిస్తూ నాగేశ్వరరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ సహోద్యోగిని వ్యక్తిగతంగా విమర్శించడం బాధ కలిగిస్తున్నప్పటికీ, సర్వీస్‌లో ఏర్పడిన స్నేహబంధం కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు.

కేవలం బదిలీ చేసినంత మాత్రాన తనపై తాను చేసిన ఆరోపణలు తొలగిపోవని పేర్కొన్న ఆయన.. సజ్జనార్‌పై గతంలో తాను ప్రస్తావించిన ఆరోపణలన్నింటిపైనా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆ ఆరోపణలు నిజమని విచారణలో తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.

మాజీ ఐపీఎస్ అధికారి చేసిన ఈ వ్యాఖ్యలు పోలీసు వర్గాలతో పాటు రాజకీయ, పరిపాలనా వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. అయితే, ఇవి నాగేశ్వరరావు చేసిన ఆరోపణలు మాత్రమేనని, వాటిపై విచారణలో వాస్తవాలు వెల్లడికావాల్సి ఉంది.

Sthanikam

సజ్జనార్‌పై మాజీ ఐపీఎస్ నాగేశ్వరరావు తీవ్ర వ్యాఖ్యలు.. సమగ్ర విచారణకు డిమాండ్

Article Image

హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్‌ను మరో పోస్టుకు బదిలీ చేయడంపై మాజీ ఐపీఎస్ అధికారి నాగేశ్వరరావు స్పందించారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్‌కు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ధన్యవాదాలు తెలిపారు.సజ్జనార్‌ను పోలీస్ యూనిఫాంలో ఉన్న నేరస్థుడిగా అభివర్ణిస్తూ నాగేశ్వరరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ సహోద్యోగిని వ్యక్తిగతంగా విమర్శించడం బాధ కలిగిస్తున్నప్పటికీ, సర్వీస్‌లో ఏర్పడిన స్నేహబంధం కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు.

కేవలం బదిలీ చేసినంత మాత్రాన తనపై తాను చేసిన ఆరోపణలు తొలగిపోవని పేర్కొన్న ఆయన.. సజ్జనార్‌పై గతంలో తాను ప్రస్తావించిన ఆరోపణలన్నింటిపైనా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆ ఆరోపణలు నిజమని విచారణలో తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.

మాజీ ఐపీఎస్ అధికారి చేసిన ఈ వ్యాఖ్యలు పోలీసు వర్గాలతో పాటు రాజకీయ, పరిపాలనా వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. అయితే, ఇవి నాగేశ్వరరావు చేసిన ఆరోపణలు మాత్రమేనని, వాటిపై విచారణలో వాస్తవాలు వెల్లడికావాల్సి ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి