Sthanikam - Truth Matters
Logo

పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి

Updated : 13 Nov 2026 13:55 IST
As Preferred Source 1 min read
పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి

రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేపట్టాలి.. అవసరమైతే కొనుగోలు కేంద్రాలు పెంచాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

నల్లగొండ: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లకు పక్కా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పది రోజుల్లో ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. అవసరమైతే కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. నల్లగొండ జిల్లాలోనే అత్యధికంగా ధాన్యం ఉత్పత్తి అయినట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.అలాగే రాబోయే సీజన్‌లో కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యత అని మంత్రి స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్), ఎమ్మెల్సీ శంకర్ నాయక్, నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి