Sthanikam - Truth Matters
Logo

ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలి : సీనియర్ సివిల్ జడ్జి జి. హిమబిందు.

Updated : 13 Nov 2026 05:52 IST
As Preferred Source 1 min read
ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలి : సీనియర్ సివిల్ జడ్జి జి. హిమబిందు.

పారా లీగల్ వాలంటీర్లకు గుర్తింపు కార్డులు పంపిణీ.

నల్లగొండ, నవంబర్ : పారా లీగల్ వాలంటీర్లు ప్రజలకు మరింత చేరువగా ఉంటూ చట్టాలపై అవగాహన కల్పించాలని నల్లగొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి. హిమబిందు సూచించారు. గురువారం నల్లగొండలో పారా లీగల్ వాలంటీర్లకు ఆమె గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు స్వచ్ఛందంగా అందిస్తున్న సేవలను అభినందించారు. న్యాయ సేవల గురించి ప్రజలకు వివరించడంతో పాటు, చట్టాలపై అవగాహన పెంపొందించేందుకు కృషి చేయాలని కోరారు. న్యాయ సహాయం అవసరమైన వారికి తగిన మార్గనిర్దేశం చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ స్వర్ణలత, సీనియర్ పారా లీగల్ వాలంటీర్లు పగడాల నాగయ్య, తుల వెంకటేశ్వర్లు, భీమనపల్లి శ్రీకాంత్, రాఘవేందర్, పాల్వాయి వెంకటేశ్వర్లు, జయరాజు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలి : సీనియర్ సివిల్ జడ్జి జి. హిమబిందు.

Article Image

పారా లీగల్ వాలంటీర్లకు గుర్తింపు కార్డులు పంపిణీ.

నల్లగొండ, నవంబర్ : పారా లీగల్ వాలంటీర్లు ప్రజలకు మరింత చేరువగా ఉంటూ చట్టాలపై అవగాహన కల్పించాలని నల్లగొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి. హిమబిందు సూచించారు. గురువారం నల్లగొండలో పారా లీగల్ వాలంటీర్లకు ఆమె గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు స్వచ్ఛందంగా అందిస్తున్న సేవలను అభినందించారు. న్యాయ సేవల గురించి ప్రజలకు వివరించడంతో పాటు, చట్టాలపై అవగాహన పెంపొందించేందుకు కృషి చేయాలని కోరారు. న్యాయ సహాయం అవసరమైన వారికి తగిన మార్గనిర్దేశం చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ స్వర్ణలత, సీనియర్ పారా లీగల్ వాలంటీర్లు పగడాల నాగయ్య, తుల వెంకటేశ్వర్లు, భీమనపల్లి శ్రీకాంత్, రాఘవేందర్, పాల్వాయి వెంకటేశ్వర్లు, జయరాజు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి