Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

పశువైద్యశాలకు రూ.15 వేల విలువైన ఔషధాలు, శస్త్రచికిత్స పరికరాల వితరణ

Updated : 13 Nov 2026 05:33 IST
As Preferred Source 1 min read
పశువైద్యశాలకు రూ.15 వేల విలువైన ఔషధాలు, శస్త్రచికిత్స పరికరాల వితరణ

మూగజీవాల వైద్య సేవలకు తోడ్పాటునందించే లక్ష్యంతో కోదాడ పట్టణ ప్రాంతీయ పశువైద్యశాలలోని పశు ఔషధ బ్యాంకుకు రూ.15 వేల విలువైన అత్యవసర పశు ఔషధాలు, ఎముకల శస్త్రచికిత్స పరికరాలు, శస్త్రచికిత్సకు ఉపయోగించే అక్రిల్ దారాలను నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సత్యసాయి సేవా సమితి జిల్లా సభ్యులు చలమల్ల వెంకటలక్ష్మారెడ్డి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి. పెంటయ్య మాట్లాడుతూ మూగజీవాల పట్ల ప్రేమతో నిరంతరం పశు వైద్యానికి అవసరమైన ఔషధాలను అందిస్తూ వెంకటలక్ష్మారెడ్డి ఇతర దాతలకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఆయన సేవాభావం, దయాగుణం అభినందనీయమని పేర్కొన్నారు. పశువైద్య సేవలకు దాతల సహకారం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ సిరిపురపు సురేంద్ర, సిబ్బంది బడేటి శివ, కంపాటి చంద్రకళ, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పశువైద్యశాలకు రూ.15 వేల విలువైన ఔషధాలు, శస్త్రచికిత్స పరికరాల వితరణ

Article Image

మూగజీవాల వైద్య సేవలకు తోడ్పాటునందించే లక్ష్యంతో కోదాడ పట్టణ ప్రాంతీయ పశువైద్యశాలలోని పశు ఔషధ బ్యాంకుకు రూ.15 వేల విలువైన అత్యవసర పశు ఔషధాలు, ఎముకల శస్త్రచికిత్స పరికరాలు, శస్త్రచికిత్సకు ఉపయోగించే అక్రిల్ దారాలను నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సత్యసాయి సేవా సమితి జిల్లా సభ్యులు చలమల్ల వెంకటలక్ష్మారెడ్డి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి. పెంటయ్య మాట్లాడుతూ మూగజీవాల పట్ల ప్రేమతో నిరంతరం పశు వైద్యానికి అవసరమైన ఔషధాలను అందిస్తూ వెంకటలక్ష్మారెడ్డి ఇతర దాతలకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఆయన సేవాభావం, దయాగుణం అభినందనీయమని పేర్కొన్నారు. పశువైద్య సేవలకు దాతల సహకారం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ సిరిపురపు సురేంద్ర, సిబ్బంది బడేటి శివ, కంపాటి చంద్రకళ, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి