Sthanikam - Truth Matters
Logo

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. రైతులకు తప్పని కష్టాలు!

Updated : 13 Nov 2026 07:04 IST
As Preferred Source 1 min read
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. రైతులకు తప్పని కష్టాలు!

వెంటనే కొనుగోళ్లు చేపట్టాలి.. లేదంటే ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకునే అవకాశం కల్పించాలి: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.


చిట్యాల: ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యంతో రైతులు పడుతున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. గురువారం చిట్యాల మండలం ఆరెగూడెం, వెలిమినేడు గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 15 రోజులు దాటినా ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. రోజుల తరబడి కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న రైతులు అప్పులు తీర్చలేక, తదుపరి పంటకు పెట్టుబడులు సమకూర్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Sthanikam

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. రైతులకు తప్పని కష్టాలు!

Article Image

వెంటనే కొనుగోళ్లు చేపట్టాలి.. లేదంటే ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకునే అవకాశం కల్పించాలి: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.


చిట్యాల: ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యంతో రైతులు పడుతున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. గురువారం చిట్యాల మండలం ఆరెగూడెం, వెలిమినేడు గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 15 రోజులు దాటినా ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. రోజుల తరబడి కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న రైతులు అప్పులు తీర్చలేక, తదుపరి పంటకు పెట్టుబడులు సమకూర్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి