Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

పల్లవి కిడ్జ్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

Updated : 13 Nov 2026 18:36 IST
As Preferred Source 1 min read
పల్లవి కిడ్జ్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

చిన్నారులకు బహుమతులు అందజేసిన డాక్టర్ కె. రాజకుమార్ రెడ్డి.

తుర్కయంజాల్, నవంబర్ 13: స్థానికం ప్రతినిధి

తుర్కయంజాల్‌లోని పల్లవి కిడ్జ్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భీష్మరాజ్ సేవా సంస్థ అధ్యక్షుడు డాక్టర్ కె. రాజకుమార్ రెడ్డికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కవిత శాలువాతో సన్మానం చేశారు. అనంతరం ఆయన విద్యార్థులకు బహుమతులు అందజేసి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా డాక్టర్ రాజకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు అని అన్నారు. పిల్లలకు ఆస్తిపాస్తులు ఇవ్వడం కంటే ఉత్తమ సంస్కారం, నాణ్యమైన విద్య అందించడం ముఖ్యమని పేర్కొన్నారు. చిన్నారుల్లోని సృజనాత్మకతను ప్రోత్సహిస్తూ, ఆసక్తి ఉన్న రంగాల్లో ఎదిగేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకరించాలని సూచించారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కవిత మాట్లాడుతూ డాక్టర్ రాజకుమార్ రెడ్డి కార్యక్రమానికి హాజరై విద్యార్థులను ప్రోత్సహించడం ఆనందంగా ఉందన్నారు. వేడుకల్లో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, భీష్మరాజ్ సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పల్లవి కిడ్జ్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి