మాలధారణతో ప్రజల్లో ఐక్యతాభావం, దైవచింతన: ఆదిమూలం శంకర్ గురుస్వామి
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
కార్తీక మాసాన్ని పురస్కరించుకుని చౌటుప్పల్ మండలంలో మొట్టమొదటిసారిగా శివదీక్ష మాలధారణ కార్యక్రమాన్ని శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు శివదీక్ష మాలలు ధరించి, పరమశివుని ఆరాధనకు శ్రీకారం చుట్టారు.
కార్యక్రమంలో ఆదిమూలం శంకర్ గురుస్వామి మాట్లాడుతూ.. శివదీక్ష మాలధారణ అనేది కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాకుండా, ప్రజల్లో ఐక్యతాభావాన్ని పెంపొందించే గొప్ప సంప్రదాయమని అభివర్ణించారు. 41 రోజుల పాటు నియమ నిష్ఠలతో దీక్షను కొనసాగించడం వల్ల భక్తుల్లో భక్తిశ్రద్ధలతో పాటు క్రమశిక్షణ, ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన అలవడతాయని తెలిపారు. కార్తీక మాసంలో శివారాధన వల్ల మనసుకు ప్రశాంతత లభించడంతో పాటు సమాజంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుందని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా భక్తులందరూ ఐక్యంగా ఉండి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మండలంలో తొలిసారిగా ప్రారంభమైన ఈ దీక్షా కార్యక్రమం భవిష్యత్తులో మరింత విస్తరించి, ఎంతోమందికి భక్తిమార్గంలో స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గురుస్వాములు వీరమల్ల దాసు గౌడ్, కుక్కల నరసింహ, శంకర్ నాయక్, దోర్నాల గజేందర్, ముప్పిడి కృష్ణ, పున్న శివ, భీమనగొని బాల శివ తదితర శివస్వాములు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి