నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
చౌటుప్పల్ శ్రీ మత్యగిరి లక్ష్మీనరసింహస్వామి ట్రాక్టర్ ఓనర్ అసోసియేషన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణంలోని శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయ ఆవరణలో గురువారం ట్రాక్టర్ యజమానుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అసోసియేషన్ గౌరవ సలహాదారులు పూసుకురి యాదగిరి, మెండే బుచ్చయ్య, చేవగోని వెంకటేష్ గౌడ్, గౌరవ అధ్యక్షుడు ఉడుగు ఇస్తారిల ఆధ్వర్యంలో ఈ ఎన్నిక ప్రక్రియ సాగింది.అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా చేవగోని రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా సుర్కంటి నర్సిరెడ్డిలను సభ్యులు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.అధ్యక్షుడు చేవగోని రమేష్ గౌడ్, ఉపాధ్యక్షులు దొనకొండ గోవర్ధన్, చిందం అశోక్, ప్రధాన కార్యదర్శి సుర్కంటి నర్సిరెడ్డి, కోశాధికారులు ఆరుట్ల లింగస్వామి, ముప్పిడి లింగస్వామి గౌడ్,కార్యనిర్వాహక కార్యదర్శులు సరిపల్లి అశోక్, పూసుకురి శీను, బొంగు శివగౌడ్ ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు చేవగోని రమేష్ గౌడ్ మాట్లాడుతూ... అసోసియేషన్ అభివృద్ధికి, ట్రాక్టర్ యజమానుల సంక్షేమానికి, ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు.ఈ సమావేశంలో గౌరవ సభ్యులు చింతల మధుసూదన్ రెడ్డి, బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి, గుణగోని కృష్ణ, పబ్బతి లక్ష్మయ్య, సుర్కంటి యాదిరెడ్డి, యానాల యాదిరెడ్డి, ఉదరి యాదయ్య, సుర్కంటి శంకర్ రెడ్డి, కొమురెల్లి ఉపేందర్ రెడ్డి, మరుపాక నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి