కిక్ బాక్సింగ్ క్రీడల్లో యువత ప్రతి ఒక్కరూ ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని కిక్ బాక్సింగ్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పోచయ్య, మోసిన్, బెల్ బహదూర్ పిలుపునిచ్చారు. గురువారం సదాశివపేట పట్టణంలో కిక్ బాక్సింగ్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సదాశివపేటకు చెందిన మహమూద్ ఆరిఫ్, మణికొండ వంశీ, బోయిని లావణ్యలకు అసోసియేషన్ సభ్యత్వం అందజేశారు. గత నెలలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పట్టణంలో నిర్వహించిన జాతీయస్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో మహమూద్ ఆరిఫ్ బంగారు పతకం సాధించగా, బోయిని లావణ్య ఐదో స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఘనంగా సన్మానించారు. జిల్లా అధ్యక్షుడు పోచయ్య మాట్లాడుతూ కిక్ బాక్సింగ్ కేవలం ఆత్మరక్షణ కోసం మాత్రమే ఉపయోగించాలని, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగించకూడదని సూచించారు. ఈ క్రీడ ద్వారా శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు. అనంతరం నయాబ్ గ్రూప్ అధినేత మహమ్మద్ వాజీద్ మాట్లాడుతూ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి ప్రభుత్వం అందించే క్రీడా కోటా ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎం.డి. షరీఫ్, మన్నె నిహారిక, విజయ్ కుమార్, నరసింహులు మాస్టర్లు తదితరులు పాల్గొన్నా
రు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి