Sthanikam - Truth Matters
Logo

జాతీయ స్థాయి యోగా పోటీల్లో ఓక్‌ట్రీ స్కూల్ విద్యార్థుల సత్తా

Updated : 05 Nov 2026 16:28 IST
As Preferred Source 1 min read
జాతీయ స్థాయి యోగా పోటీల్లో ఓక్‌ట్రీ స్కూల్ విద్యార్థుల సత్తా

బంగారు, వెండి, కాంస్య పతకాలతో మెరిసిన విద్యార్థులు.


నల్లగొండ, నవంబర్ 4: జాతీయ స్థాయి యోగా పోటీల్లో నల్లగొండలోని ఓక్‌ట్రీ స్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారు. తమిళనాడు రాష్ట్రం చెన్నైలో నవంబర్ 1న ఇండియన్ హఠ యోగా ఫెడరేషన్ (IHYF) ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో పతకాలు సాధించి సత్తా చాటారు.ఎనిమిదో తరగతి విద్యార్థిని ఎం. హైందవి బంగారు పతకం, ఐదో తరగతి విద్యార్థి టి.హెచ్. చతుర్వ కుషాల్ వెండి పతకం, ఆరో తరగతి విద్యార్థి ఎం. వేదాంత్ కాంస్య పతకం సాధించారు.విజేతలను పాఠశాల చైర్మన్ తుమ్మలపల్లి హనుమంతరెడ్డి, డైరెక్టర్లు గడ్డం మంగారెడ్డి, యదుల్ల సునీల్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం అభినందించారు. విద్యతోపాటు క్రీడలు, యోగాలోనూ విద్యార్థులను ప్రోత్సహించడం వల్లే ఇలాంటి విజయాలు సాధ్యమవుతున్నాయని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.

Sthanikam

జాతీయ స్థాయి యోగా పోటీల్లో ఓక్‌ట్రీ స్కూల్ విద్యార్థుల సత్తా

Article Image

బంగారు, వెండి, కాంస్య పతకాలతో మెరిసిన విద్యార్థులు.


నల్లగొండ, నవంబర్ 4: జాతీయ స్థాయి యోగా పోటీల్లో నల్లగొండలోని ఓక్‌ట్రీ స్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారు. తమిళనాడు రాష్ట్రం చెన్నైలో నవంబర్ 1న ఇండియన్ హఠ యోగా ఫెడరేషన్ (IHYF) ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో పతకాలు సాధించి సత్తా చాటారు.ఎనిమిదో తరగతి విద్యార్థిని ఎం. హైందవి బంగారు పతకం, ఐదో తరగతి విద్యార్థి టి.హెచ్. చతుర్వ కుషాల్ వెండి పతకం, ఆరో తరగతి విద్యార్థి ఎం. వేదాంత్ కాంస్య పతకం సాధించారు.విజేతలను పాఠశాల చైర్మన్ తుమ్మలపల్లి హనుమంతరెడ్డి, డైరెక్టర్లు గడ్డం మంగారెడ్డి, యదుల్ల సునీల్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం అభినందించారు. విద్యతోపాటు క్రీడలు, యోగాలోనూ విద్యార్థులను ప్రోత్సహించడం వల్లే ఇలాంటి విజయాలు సాధ్యమవుతున్నాయని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి