నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల ప్రజలందరూ దీపావళి పండుగను ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోవాలని ఎస్సై దుర్గా రెడ్డి కోరారు. ఈ సందర్భంగా మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. టపాసులు విక్రయించే దుకాణదారులు తప్పనిసరిగా పోలీస్, అగ్నిమాపక శాఖల నుంచి అనుమతులు పొందాలని, అనుమతులు లేకుండా విక్రయాలు జరిపితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టపాసులు కాల్చేవారు జనసంచారం లేని బహిరంగ ప్రదేశాలను ఎంచుకోవాలని, ఇళ్లు, దుకాణాలు, వాహనాలకు దూరంగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. చిన్నపిల్లలు టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు తప్పనిసరిగా దగ్గరుండి పర్యవేక్షించాలని తెలిపారు. ప్రజలందరూ పోలీసుల సూచనలు, భద్రతా నిబంధనలు పాటిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో, సురక్షితంగా జరుపుకోవాలని ఎస్సై దుర్గా రెడ్డి విజ్ఞప్తి చేశారు.
దీపావళి పండుగను జాగ్రత్తగా జరుపుకోవాలి – ఎస్సై దుర్గా రెడ్డి
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి