Sthanikam - Truth Matters
Logo

మలి దశ ఉద్యమకారుడు మంద వేణుగోపాల్‌రెడ్డి హౌస్ అరెస్ట్

Updated : 05 Nov 2026 11:43 IST
As Preferred Source 1 min read
మలి దశ ఉద్యమకారుడు మంద వేణుగోపాల్‌రెడ్డి హౌస్ అరెస్ట్

అక్రమ పోలీసు చర్యలను ఖండించిన తెలంగాణ మలి దశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం.


చిట్యాల: తెలంగాణ మలి దశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంద వేణుగోపాల్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడాన్ని సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా మంద వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల హక్కులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం ప్రశ్నిస్తున్న గొంతులను ప్రభుత్వం అణచివేయాలని చూస్తోందని ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. అక్రమ అరెస్టులు, బెదిరింపులకు ఉద్యమకారులు భయపడరని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమకారులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Sthanikam

మలి దశ ఉద్యమకారుడు మంద వేణుగోపాల్‌రెడ్డి హౌస్ అరెస్ట్

Article Image

అక్రమ పోలీసు చర్యలను ఖండించిన తెలంగాణ మలి దశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం.


చిట్యాల: తెలంగాణ మలి దశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంద వేణుగోపాల్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడాన్ని సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా మంద వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల హక్కులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం ప్రశ్నిస్తున్న గొంతులను ప్రభుత్వం అణచివేయాలని చూస్తోందని ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. అక్రమ అరెస్టులు, బెదిరింపులకు ఉద్యమకారులు భయపడరని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమకారులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి