ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడంతో పాటు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అధ్యాపకులు సమష్టిగా కృషి చేయాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సురేష్‌రెడ్డి సూచించారు. బుధవారం రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన తనిఖీ చేసి, కళాశాల నిర్వహణ, విద్యాబోధన, వివిధ రికార్డులను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లాలో అత్యధిక అడ్మిషన్లు నమోదు చేసినందుకు కళాశాల ప్రిన్సిపాల్ జగదీష్, అధ్యాపక బృందాన్ని అభినందించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. రాబోయే వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని అదనపు తరగతులు, ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహించాలని సూచించారు.
విద్యార్థులపై ప్రత్యేక పర్యవేక్షణ.
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను గుర్తించి, చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రతి విద్యార్థి ప్రగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కేర్‌టేకర్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. అధ్యాపకులు బాధ్యతతో పనిచేస్తూ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు.
ఈ తనిఖీలో కళాశాల ప్రిన్సిపాల్ జగదీష్‌తో పాటు అధ్యాపకులు ప్రసూన దేవి, పున్నారావు, మాలె వెంకట్ రెడ్డి, కిరణ్, నరసింహారావు, అశోక్ కుమార్, శ్రీకాంత్, నగేష్, అశోక్ రెడ్డి, ఉపేందర్ రావు, నిర్మల, కవిత, రాజేశ్వరి, ఉమారాణి, కరుణ, నాగమణి, పరశురాములు, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి