మణుగూరు ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న జి. ప్రవల్లిక అకాల మృతి ఆర్టీసీ కార్మికుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.తోటి ఉద్యోగిని దూరం కావడంతో దిగ్భ్రాంతికి గురైన కోదాడ ఆర్టీసీ డిపో ఉద్యోగులు ఆమెకు బుధవారం నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కోదాడ ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ప్రవల్లిక చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కొద్దిసేపు మౌనం పాటించారు.ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ..విధి నిర్వహణలో తమతో కలిసి పనిచేసిన సహోద్యోగిని కోల్పోవడం ఎంతో బాధాకరమని అన్నారు. ఆర్టీసీ కుటుంబంలో ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన అనుబంధం ఉంటుందని,అలాంటి కుటుంబంలో ఒక సభ్యురాలు దూరం కావడం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవల్లికతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు.ఈ విషాద సమయంలో మృతురాలి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని,వారికి మనోధైర్యం కలగాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు కోదాడ ఆర్టీసీ డిపో ఉద్యోగులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కోదాడ ఆర్టీసీ డిపోకు చెందిన పలువురు ఉద్యోగులు, కార్మికులు పాల్గొని ప్రవల్లికకు నివాళులర్పించారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి