Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

రాంనగర్ కాలనీలో అండర్ డ్రైనేజీ పనుల పరిశీలన

Updated : 04 Nov 2026 19:43 IST
As Preferred Source 1 min read
రాంనగర్ కాలనీలో అండర్ డ్రైనేజీ పనుల పరిశీలన

నాణ్యతా ప్రమాణాలతో పనులు త్వరగా పూర్తి చేయాలి

కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ వర్కాల వెంకట్ కుమార్ గౌడ్

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు రాంనగర్ కాలనీలో చేపడుతున్న అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులను మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ వర్కాల వెంకట్ కుమార్ గౌడ్ బుధవారం పరిశీలించారు.​ఈ సందర్భంగా ఆయన క్షేత్రస్థాయిలో నిర్మాణ పురోగతిని పరిశీలించి, సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని, ఎక్కడా రాజీ పడకుండా త్వరితగతిన పూర్తి చేసి కాలనీవాసులకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.​నిర్మాణ పనుల సమయంలో కాలనీ ప్రజలు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజా సంక్షేమానికి, మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం, పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నాయని ఈ సందర్భంగా వెంకట్ కుమార్ గౌడ్ తెలిపారు.

Sthanikam

రాంనగర్ కాలనీలో అండర్ డ్రైనేజీ పనుల పరిశీలన

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి