రానున్న నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటరు నమోదు ప్రక్రియపై బీఆర్ఎస్ నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా బుధవారం మునగాల మండల కేంద్రంలోని న్యూ ప్రజ్ఞ హైస్కూల్‌లో పట్టభద్రులు, విద్యావంతులకు ఓటరు నమోదు ఆవశ్యకతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సుంకరి అజయ్ కుమార్, మండల అధ్యక్షుడు తొగరు రమేష్ మాట్లాడుతూ.. 2023 సంవత్సరం వరకు డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన ప్రతి ఒక్కరూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు కోసం తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు.గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారు సైతం తాజా ఎన్నికల కోసం మళ్లీ ఓటరుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు.
విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి పట్టభద్రులు మద్దతు తెలపాలని కోరారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును బీఆర్ఎస్ అభ్యర్థికి వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉడుం కృష్ణ, వేట శివాజీ, వి. నరసింహారావు, పాఠశాల కరస్పాండెంట్ కాచాని కృష్ణమూర్తి, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి