స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భువనగిరిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్-17 వాలీబాల్ పోటీల్లో కోదాడ పట్టణంలోని ఎన్‌ఆర్‌ఎస్ కళాశాల ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని తేజశ్రీ ప్రతిభ చాటింది. ఉమ్మడి నల్గొండ జిల్లా జట్టుకు ఎంపిక కావడంతో పాటు పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచి బెస్ట్ ప్లేయర్ అవార్డును సొంతం చేసుకుంది.ఈ సందర్భంగా బుధవారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి, డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాలరావు, ప్రిన్సిపాల్ జి.వి., వైస్ ప్రిన్సిపాల్ పి.ఎన్.ఆర్.తో పాటు పలువురు అధ్యాపకులు తేజశ్రీని ఘనంగా అభినందించారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచి కళాశాలకు మంచి గుర్తింపు తీసుకురావడం గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో తేజశ్రీ ప్రతిభ.. బెస్ట్ ప్లేయర్ అవార్డు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి