Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

జన సురక్ష క్యాంపులో మూడు కుటుంబాలకు రూ.6 లక్షల బీమా చెక్కుల పంపిణీ

Updated : 04 Nov 2026 18:27 IST
As Preferred Source 1 min read
జన సురక్ష క్యాంపులో మూడు కుటుంబాలకు రూ.6 లక్షల బీమా చెక్కుల పంపిణీ

మునగాల మండలం ఆకుపాముల ఎస్‌బీఐ శాఖ ఆధ్వర్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు జన సురక్ష అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో రూ.436 ప్రీమియంతో బీమా పొందిన మూడు కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.6 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ ఉడతల వంశీ, ఫీల్డ్ ఆఫీసర్ భూక్య బాల సైదులు, సర్పంచ్ వి. వసుంధర, ఉపసర్పంచ్ కేశగాని నాగేశ్వరరావు, ఆర్‌బీఐ సీఎఫ్ఎల్ కౌన్సిలర్ వేముల కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పీఎం జీవన్ జ్యోతి బీమా, పీఎం సురక్ష బీమా, అటల్ పెన్షన్ యోజన వంటి సామాజిక భద్రత పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Sthanikam

జన సురక్ష క్యాంపులో మూడు కుటుంబాలకు రూ.6 లక్షల బీమా చెక్కుల పంపిణీ

Article Image

మునగాల మండలం ఆకుపాముల ఎస్‌బీఐ శాఖ ఆధ్వర్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు జన సురక్ష అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో రూ.436 ప్రీమియంతో బీమా పొందిన మూడు కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.6 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ ఉడతల వంశీ, ఫీల్డ్ ఆఫీసర్ భూక్య బాల సైదులు, సర్పంచ్ వి. వసుంధర, ఉపసర్పంచ్ కేశగాని నాగేశ్వరరావు, ఆర్‌బీఐ సీఎఫ్ఎల్ కౌన్సిలర్ వేముల కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పీఎం జీవన్ జ్యోతి బీమా, పీఎం సురక్ష బీమా, అటల్ పెన్షన్ యోజన వంటి సామాజిక భద్రత పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి