కోదాడలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 22 మందిని బుధవారం కోదాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, ప్రథమ శ్రేణి మేజిస్ట్రేట్ ఎండీ. ఉమర్ ఎదుట హాజరుపరచగా శిక్ష విధించారు. వీరిలో ఏడుగురికి ఒకరోజు,మరొకరికి రెండు రోజుల జైలు శిక్ష విధించగా, మిగిలిన 14 మందికి మొత్తం రూ.22,500 జరిమానా విధించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్‌ఐ అంజిరెడ్డి మాట్లాడుతూ..మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందన్నారు.వాహనదారులు బాధ్యతగా వ్యవహరించాలని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
డ్రంకెన్ డ్రైవ్ కేసులో 8 మందికి జైలు శిక్ష
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి