Sthanikam - Truth Matters
Logo

అక్రమ కారుణ్య నియామకంపై కలెక్టర్ కొరడా.. మెడికల్ ఆఫీసర్ సస్పెండ్

Updated : 05 Nov 2026 14:55 IST
As Preferred Source 1 min read
అక్రమ కారుణ్య నియామకంపై కలెక్టర్ కొరడా.. మెడికల్ ఆఫీసర్ సస్పెండ్

నల్లగొండ: శాలిగౌరారం మండలంలో వెలుగుచూసిన అక్రమ కారుణ్య నియామకాల వ్యవహారంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ చర్యలు చేపట్టారు. అక్రమంగా కారుణ్య నియామక ప్రతిపాదనలు పంపినట్లు తేలడంతో శాలిగౌరారం మెడికల్ ఆఫీసర్ సూర్యశిల్పను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రిటైర్డ్ ఉద్యోగి కుమారుడికి కారుణ్య నియామకం కల్పించిన ఈ వ్యవహారంలో సుమారు రూ.40 లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమ వ్యవహారంలో మొత్తం 11 మంది పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెడికల్ ఆఫీసర్‌పై చర్యలతో ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Sthanikam

అక్రమ కారుణ్య నియామకంపై కలెక్టర్ కొరడా.. మెడికల్ ఆఫీసర్ సస్పెండ్

Article Image

నల్లగొండ: శాలిగౌరారం మండలంలో వెలుగుచూసిన అక్రమ కారుణ్య నియామకాల వ్యవహారంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ చర్యలు చేపట్టారు. అక్రమంగా కారుణ్య నియామక ప్రతిపాదనలు పంపినట్లు తేలడంతో శాలిగౌరారం మెడికల్ ఆఫీసర్ సూర్యశిల్పను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రిటైర్డ్ ఉద్యోగి కుమారుడికి కారుణ్య నియామకం కల్పించిన ఈ వ్యవహారంలో సుమారు రూ.40 లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమ వ్యవహారంలో మొత్తం 11 మంది పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెడికల్ ఆఫీసర్‌పై చర్యలతో ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి