Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

అధికారులు.. కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యం!

Updated : 05 Nov 2026 16:28 IST
As Preferred Source 1 min read
అధికారులు.. కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యం!

చౌటుప్పల్‌లో జంక్షన్ల మూసివేతతో నిత్యం నరకం

స్పష్టత లేక వాహనదారులు, పాదచారుల తీవ్ర అవస్థలు

శాశ్వత పరిష్కారం చూపకపోతే పోరాటం తప్పదు: అడ్వకేట్‌ చెరుకు శివకుమార్‌ గౌడ్‌

చౌటుప్పల్‌ స్థానికం ప్రతినిధి:

చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారిపై జంక్షన్ల (రహదారి దాటేందుకు కేటాయించిన మార్గాలు) నిర్వహణలో అధికారులు, ట్రాఫిక్‌ సిబ్బంది, కాంట్రాక్టర్‌ వ్యవహరిస్తున్న తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా జంక్షన్లను ఒకసారి తెరవడం, మరుక్షణమే మూసివేయడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర అయోమయానికి గురవుతూ రోడ్డు దాటేందుకు కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోందని లబోదిబోమంటున్నారు.​ఈ సందర్భంగా అడ్వకేట్‌ చెరుకు శివకుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ఇటీవల తంగడపల్లి రోడ్డు జంక్షన్‌ పునరుద్ధరణ జరిగిందంటూ కొందరు సోషల్‌ మీడియా వేదికగా విస్తృత ప్రచారం చేసుకున్నారని, కానీ క్షేత్రస్థాయిలో మళ్లీ పాత పరిస్థితులే పునరావృతమయ్యాయని మండిపడ్డారు. కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా ప్రజలకు ఎదురవుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిస్కారం చూపించాలని ఆయన డిమాండ్‌ చేశారు.అధికారులు తక్షణమే స్పందించి చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అన్ని జంక్షన్లను పునరుద్ధరించాలని, వాటి నిర్వహణపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని కోరారు. ప్రత్యామ్నాయ మార్గాలతో పాటు ప్రధాన కూడళ్ల వద్ద హెచ్చరిక, సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారులు ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి తగిన చర్యలు తీసుకోకపోతే ప్రజల పక్షాన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Sthanikam

అధికారులు.. కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యం!

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి