Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సంగారెడ్డి

సంగారెడ్డిలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. నిర్మలా జగ్గారెడ్డి ప్రారంభం

Updated : 05 Nov 2026 18:56 IST
As Preferred Source 1 min read
సంగారెడ్డిలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. నిర్మలా జగ్గారెడ్డి ప్రారంభం

సంగారెడ్డి పట్టణంలోని 13, 34వ వార్డుల్లో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను టీజీఐఐసీ మాజీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ప్రారంభించారు. 13వ వార్డులో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు, 34వ వార్డులో మున్సిపల్ జనరల్ ఫండ్ నిధులతో చేపట్టనున్న సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు ఆమె శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పట్టణంలో డ్రైనేజీ సమస్యలను పరిష్కరించి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనిత సంతోష్, వైస్ చైర్మన్ షఫీ, కౌన్సిలర్లు వీణా కిరణ్, అన్వర్, మహేష్, శ్రీకాంత్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు మహేందర్ రెడ్డి, శ్రీధర్,రాజశేఖర్ రెడ్డి, అడ్డూ,మున్నా, రాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సంగారెడ్డిలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. నిర్మలా జగ్గారెడ్డి ప్రారంభం

Article Image

సంగారెడ్డి పట్టణంలోని 13, 34వ వార్డుల్లో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను టీజీఐఐసీ మాజీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ప్రారంభించారు. 13వ వార్డులో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు, 34వ వార్డులో మున్సిపల్ జనరల్ ఫండ్ నిధులతో చేపట్టనున్న సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు ఆమె శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పట్టణంలో డ్రైనేజీ సమస్యలను పరిష్కరించి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనిత సంతోష్, వైస్ చైర్మన్ షఫీ, కౌన్సిలర్లు వీణా కిరణ్, అన్వర్, మహేష్, శ్రీకాంత్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు మహేందర్ రెడ్డి, శ్రీధర్,రాజశేఖర్ రెడ్డి, అడ్డూ,మున్నా, రాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి