Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నిజామాబాద్

సిరికొండ లో 102 అంబులెన్సు సేవలు... గర్భిణీ మహిళలకు మరింత చేరువ...

Updated : 05 Nov 2026 17:39 IST
As Preferred Source 1 min read
సిరికొండ లో 102 అంబులెన్సు సేవలు... గర్భిణీ మహిళలకు మరింత చేరువ...

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలలోని ప్రజలకు ప్రత్యేకంగా గర్భిణీ మహిళలకు ప్రతీ వారం నిర్వహించే అమ్మఒడి పరీక్షల నిమిత్తం వివిధ గ్రామాల నుండి వచ్చే మహిళల కోసం ఇప్పటినుండి 102 అంబులెన్సు సిరికొండలో అందుబాటులో ఉంటుందని నిజామాబాద్ జిల్లా ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ బోండ్ల స్వరాజ్ తెలిపారు.గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ తో మాట్లాడటం జరిగిందని ఈ రోజు నుండే 102 సేవలు అందుబాటులో వుంటాయని వారు అన్నారు. గర్భిణీ స్త్రీలు ఆసుపత్రిలో నిర్వహించే పరీక్షలకు మరియు ప్రసవం తర్వాత ఇంటికి చేరడానికి 102 అంబులెన్సును కచ్చితంగా ఉపయోగించుకోవాలని సూచించారు.ఈ విషయంలో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎం లు గర్భిణీ స్త్రీలకు 102 గురించి వివరించి అవగాహన కల్పించాలని కోరారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా నిరహిస్తున్న ఈ 102 అమ్మఒడి సర్వీసును ప్రతీ గర్భిణీ స్త్రీ ఉపయోగించుకోవాలని వారు అన్నారు.

Sthanikam

సిరికొండ లో 102 అంబులెన్సు సేవలు... గర్భిణీ మహిళలకు మరింత చేరువ...

Article Image

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలలోని ప్రజలకు ప్రత్యేకంగా గర్భిణీ మహిళలకు ప్రతీ వారం నిర్వహించే అమ్మఒడి పరీక్షల నిమిత్తం వివిధ గ్రామాల నుండి వచ్చే మహిళల కోసం ఇప్పటినుండి 102 అంబులెన్సు సిరికొండలో అందుబాటులో ఉంటుందని నిజామాబాద్ జిల్లా ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ బోండ్ల స్వరాజ్ తెలిపారు.గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ తో మాట్లాడటం జరిగిందని ఈ రోజు నుండే 102 సేవలు అందుబాటులో వుంటాయని వారు అన్నారు. గర్భిణీ స్త్రీలు ఆసుపత్రిలో నిర్వహించే పరీక్షలకు మరియు ప్రసవం తర్వాత ఇంటికి చేరడానికి 102 అంబులెన్సును కచ్చితంగా ఉపయోగించుకోవాలని సూచించారు.ఈ విషయంలో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎం లు గర్భిణీ స్త్రీలకు 102 గురించి వివరించి అవగాహన కల్పించాలని కోరారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా నిరహిస్తున్న ఈ 102 అమ్మఒడి సర్వీసును ప్రతీ గర్భిణీ స్త్రీ ఉపయోగించుకోవాలని వారు అన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి