Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

విద్యార్థుల ప్రగతికి తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరం

Updated : 05 Nov 2026 18:56 IST
As Preferred Source 1 min read
విద్యార్థుల ప్రగతికి తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరం

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివకుమార్ స్వామి సమక్షంలో తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశం (PTM) నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యార్థుల విద్యా ప్రగతిపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి చర్చించారు. ముఖ్యంగా విద్యార్థులు ఇటీవల నిర్వహించిన ఎఫ్‌ఏ-1, ఎఫ్‌ఏ-2, ఎస్‌ఏ-1 పరీక్షల్లో సాధించిన ఫలితాలను సమీక్షించారు. అనంతరం విద్యార్థుల హోలిస్టిక్ రికార్డులను తల్లిదండ్రులకు అందజేసి, వారి చదువు, ప్రతిభ, విద్యా పురోగతికి సంబంధించిన వివరాలను వివరించారు. అలాగే పాఠశాల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించడం, పాఠశాలలో అవసరమైన సౌకర్యాల కల్పన వంటి అంశాలపై చర్చించారు. విద్యార్థులు చదువులో మరింత రాణించాలంటే ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల సహకారం కూడా ఎంతో అవసరమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, ఉపాధ్యాయులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలని సూచించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం పాఠశాల, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మొల్ల కరిమ్, పాఠశాల ఉపాధ్యాయులు బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నా

రు.

Sthanikam

విద్యార్థుల ప్రగతికి తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి