పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి: మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
పట్టణ పరిశుభ్రతలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమైనదని, పట్టణం బాగుండాలంటే ముందుగా వారి సంక్షేమం, ఆరోగ్యం బాగుండాలని చౌటుప్పల్ మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. గురువారం చౌటుప్పల్ పురపాలక సంఘం మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు చీరలు, దుస్తులు, గ్లౌజులు, మాస్కులు, సబ్బులు, కొబ్బరి నూనె, బెల్లం, టవల్స్, షూస్, పీపీఈ కిట్లు తదితర నిత్యావసర వస్తువులను ఆమె చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ... కార్మికుల సంక్షేమం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పరంగా అందాల్సిన అన్ని వసతులను కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. పారిశుద్ధ్య కార్మికులందరినీ తన కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.అనంతరం మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర నాయక్ మాట్లాడుతూ... పారిశుద్ధ్య కార్మికులు లేనిదే పట్టణం లేదని, ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడంలో వారి సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పీపీఈ కిట్లు, రక్షణ పరికరాలను ఉపయోగిస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, పట్టణ పరిశుభ్రతకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కౌన్సిలర్లు గడ్డం ఇందిరా రాజరత్నం, పిల్లలమర్రి మధుసూదన్, కో-ఆప్షన్ సభ్యులు పస్తం గంగారామ్, నాయకులు పల్లె సురేందర్ రెడ్డి, ఉడుగు రమేష్, బత్తుల దాసు, దేప రాజు, మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, ఏఈ అంజయ్య, ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, పర్యావరణ ఇంజనీర్ రేణు కుమార్, జవాన్లు నరసింహ, అంజయ్య, పారిశుద్ధ్య కార్మికులు, వాటర్మెన్లు, ఎలక్ట్రీషియన్లు తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి