రమాదేవి వర్ధంతి సందర్భంగా రూ.1.14 లక్షల విరాళాలు పంపిణీ
అనాథలు, వృద్ధుల కోసం త్వరలో ఆశ్రమ ఏర్పాటు: చైర్మన్ రమేష్ యాదవ్
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
మల్కాపురం గ్రామం లో
రమాదేవి ఫౌండేషన్ చైర్మన్ దేవరబోయిన రమేష్ యాదవ్ తన భార్య రమాదేవి 3వ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం గ్రామంలోని పేదలు, బాధితులకు స్థానిక సర్పంచ్ గిర్కటీ నిరంజన్ గౌడ్ తో కలిసి బహుళ ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ సందర్భంగా రమేష్ యాదవ్ మాట్లాడుతూ... రానున్న రోజుల్లో రమాదేవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనాథలు, వృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతర సర్పంచ్ నిరంజన్ గౌడ్ మాట్లాడుతూ... రమేష్ యాదవ్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పేదలకు సేవ చేయడం అభినందనీయమని కొనియాడారు. ఫౌండేషన్ చేపట్టే ప్రతి మంచి కార్యక్రమానికి తన వంతు సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో భాగంగా పలువురు బాధిత కుటుంబాలకు మొత్తం రూ. 1,14,000 ఆర్థిక సాయాన్ని అందించారు.మృతి చెందిన తోటకూర సురేష్ భార్య దీపికకు రూ. 10,000,ఇటీవల కాలు ఆపరేషన్ చేయించుకున్న పగిల ఉపేందర్ కు రూ. 10,000,పక్షవాతంతో బాధపడుతున్న సాగర్ల మల్లేష్ కు రూ. 10,000, రుద్రాల జెయ్యమ్మ, కంచర్ల రమణమ్మ, పల్లె నర్సింహ, నీల కిష్టయ్య, రంగయ్యలకు ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున అందజేశారు, జింక ముత్యాలుకు రూ. 4,000, కమలరాణికి రూ. 20,000, వోడ్లమూడి రాణికి రూ. 5,000 ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో రమాదేవి ఫౌండేషన్ చైర్మన్ దేవరబోయిన రమేష్ యాదవ్, సామాజిక కార్యకర్త పల్లె లింగస్వామి, గ్రామ మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి