కోఠారీ సోదరుల స్మారకార్థం రక్తదాన శిబిరం.. 35 మంది స్వచ్ఛంద రక్తదానం
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
అయోధ్య శ్రీరామ జన్మభూమి కోసం జరిగిన కరసేవలో ప్రాణాలర్పించిన కోఠారీ సోదరుల త్యాగాలను స్మరించుకుంటూ విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ చౌటుప్పల్ ప్రఖండ ఆధ్వర్యంలో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. బజరంగ్‌దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కొండ శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ శిబిరంలో 35 మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ... కోఠారీ సోదరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడవచ్చని, యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.అనంతరం నిర్వహించిన సమావేశంలో మండలంలోని ప్రతి గ్రామంలో బజరంగ్‌దళ్ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు. హిందూ ధర్మ పరిరక్షణతో పాటు సామాజిక ఐక్యత, సేవా కార్యక్రమాలే ధ్యేయంగా కార్యకర్తలు ముందుకు సాగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బజరంగ్‌దళ్ జిల్లా సంయోజక్ గోగు రవి, వివిధ ప్రఖండాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి