Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లోకి దారి తప్పి వచ్చిన జింక.. అప్రమత్తమైన అటవీశాఖ! నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 06:55 AM

స్వాతంత్ర్య సమరయోధుడు శివరావు షేట్కార్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

స్వాతంత్ర్య సమరయోధుడు శివరావు షేట్కార్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

స్వాతంత్ర్య సమరయోధుడు శివరావు షేట్కార్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
January 13, 2026 07:23 PM 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్

నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవ్ రెడ్డి

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ శాసనసభ్యుడు దివంగత శివరావు షెట్కార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ నిబద్ధతతో కృషి చేయాలని ఆయన కుమారుడు, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ షేట్కార్ పిలుపునిచ్చారు.శివరావు షెట్కార్ 30వ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం నారాయణఖేడ్ పట్టణంలోని ఆయన సమాధి వద్ద సర్వధర్మ సమ్మేళనం, వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ షెట్కార్ మాట్లాడుతూ, స్వాతంత్ర్య ఉద్యమంలో శివరావు షెట్కార్ చేసిన సేవలు, ప్రజల కోసం సాగించిన రాజకీయ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు. ప్రజాసేవే ధ్యేయంగా, సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి కోసం ఆయన నిరంతరం పనిచేశారని గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఇటీవల ఎన్నికైన సర్పంచ్‌లను ఘనంగా సన్మానించారు. అనంతరం షెట్కార్ కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వర్ధంతి సభ అంతా భావోద్వేగ వాతావరణంలో కొనసాగింది.ఈ సభలో నారాయణఖేడ్ శాసనసభ్యుడు సంజీవరెడ్డి, ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘ సభ్యుడు నగేశ్ షెట్కార్, రాష్ట్ర యువ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ షెట్కార్, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యులు కే. శ్రీనివాస్, శంకరయ్య స్వామి, జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, సంగీత్ జితేంద్రనాథ్, సాగర్ షెట్కార్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, మాజీ జిల్లా పరిషత్ సహాయ సభ్యులు రషీద్, దిశ కమిటీ సభ్యులు ప్రకాష్ రాథోడ్, ఖేడ్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాహిర్ అలీ, నాగల్గిద్దా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాణిక్ రావు పాటేల్, బియస్ విర్ శెట్టి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.అలాగే బాల్కి మహాలింగ అప్ప, కొండాపూర్ సంగ్రామ్ మహారాజ్, శివలింగ స్వామి సహా పలువురు ప్రముఖులు వర్ధంతి సభకు హాజరై శివరావు షెట్కార్‌కు నివాళులు అర్పించారు.జహీరాబాద్ పార్లమెంట్ పరిధి అంతటినుంచి, నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ వర్ధంతి సభ శివరావు షెట్కార్ సేవలను మరోసారి గుర్తుచేసే సందర్భంగా నిలిచింది.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News