తుంగతుర్తి;ఖైరతాబాద్
ఎమ్మెల్యే దానం నాగేందర్ పై సుప్రీంకోర్టు అనర్హత వేటు వేయడాన్ని స్వాగతిస్తున్నామని న్యాయ వ్యవస్థనే కించ పరచే విధంగా తీర్పు ఇచ్చిన స్పీకర్ కు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని మండల పార్టీ అధ్యక్షుడు తాడికొండ సీతయ్యఅన్నారు. గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. భవిష్యత్ లో ఇంకెవ్వరు కూడ ఒకపార్టీలో గెలిచి మరొక పార్టీకి మారడానికి భయపడే పరిస్థితి సుప్రీం కోర్ట్ తీర్పువల్ల ఏర్పడిందని అన్నారు.. త్వరలో ఖైరతాబాద్ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతాయని అన్నారు.పార్టీ మారిన మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేల లు అనర్హత పై కూడ ఇదే తీర్పు వస్తుందని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పుకో అభినందనీయమని అన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి