Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:28 AM

సోమ కిరణ్‌కు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ

20-04-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, ఏప్రిల్ 20: ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగంలో సోమ కిరణ్ కుమార్‌కు డాక్టరేట్ (పీహెచ్‌డీ) ప్రదానం చేశారు. “టీచర్ లైబ్రేరియన్షిప్: ఏ స్టేట్ ఆఫ్ ఆర్ట్ స్టడీ” అనే అంశంపై నిర్వహించిన పరిశోధనకు గాను ఈ పట్టా లభించింది.

డాక్టర్ ఆర్‌కే పవన్ కుమార్, డాక్టర్ ఏఎస్ చక్రవర్తి పర్యవేక్షణలో ఈ పరిశోధన పూర్తి చేసినట్లు అదనపు పరీక్షల నియంత్రణ అధికారి తెలిపారు.

పరిశోధనలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని అంతర్జాతీయ K–12 పాఠశాలల్లో టీచర్ లైబ్రేరియన్ల అవసరం, వారి సేవలు, మౌలిక వసతులు, గ్రంథాలయాల పాత్ర, విద్యార్థులు–అధ్యాపకుల వినియోగం వంటి అంశాలను విశ్లేషించారు. పాఠశాలలలో గ్రంథాలయ అభివృద్ధికి పలు సూచనలు కూడా చేశారు.

ఈ సందర్భంగా లైబ్రరీ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ వివేకవర్ధన్, డాక్టర్ ఎస్. యాదగిరి, డాక్టర్ అచల మునిగల్, డాక్టర్ చేగోని రవికుమార్, డాక్టర్ భారతి తదితర అధ్యాపకులకు, పరిశోధనలో సహకరించిన అందరికీ సోమ కిరణ్ కృతజ్ఞతలు తెలిపారు.

వరంగల్‌కు చెందిన సోమ కిరణ్ తన విజయంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కీలకమని పేర్కొన్నారు.

Sthanikam

సోమ కిరణ్‌కు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News