Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సంగారెడ్డి

సంగారెడ్డి గ్రంథాలయంలో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

Updated : 19 Nov 2026 18:04 IST
As Preferred Source 1 min read
సంగారెడ్డి గ్రంథాలయంలో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

సంగారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహిస్తున్న 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆరో రోజు గురువారం (నవంబర్ 19) విద్యార్థినీ విద్యార్థులకు రంగోలి పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనిత హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా రంగోలి పోటీల్లో పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. విద్యార్థుల్లో కళాత్మక నైపుణ్యాలను, సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అతిథులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి. అంజయ్య, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం. మనోజ్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని లైబ్రేరియన్ లలితాబాయి పర్యవేక్షించారు.

Sthanikam

సంగారెడ్డి గ్రంథాలయంలో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

Article Image

సంగారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహిస్తున్న 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆరో రోజు గురువారం (నవంబర్ 19) విద్యార్థినీ విద్యార్థులకు రంగోలి పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనిత హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా రంగోలి పోటీల్లో పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. విద్యార్థుల్లో కళాత్మక నైపుణ్యాలను, సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అతిథులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి. అంజయ్య, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం. మనోజ్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని లైబ్రేరియన్ లలితాబాయి పర్యవేక్షించారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి