పెద్దకొండూరు లో దాబాపై ఉరివేసుకుని ఒడిశా వాసి ఆత్మహత్య
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
మండలంలోని పెద్దకొండూరు గ్రామంలో ఓ కార్మికుడు దాబాపై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది.పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన మూక పడియమి (26) హయత్‌నగర్‌లో నివాసం ఉంటూ పెద్దకొండూరుకు చెందిన పొలబోయిన కిరణ్‌కుమార్ వద్ద శ్రీ గణేష్ బోర్‌వెల్స్‌లో కూలీగా పనిచేస్తున్నాడు. ఈ నెల 18న స్వస్థలమైన ఒడిశాకు వెళ్లేందుకు వనస్థలిపురంలోని యజమాని ఇంటి నుంచి రాత్రి 9 గంటల సమయంలో పెద్దకొండూరుకు చేరుకున్నాడు. తెల్లవారుజామున ఒడిశాకు వెళ్తానని చెప్పి రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఇంటి దాబాపై పడుకునేందుకు వెళ్లాడు.గురువారం ఉదయం 6 గంటల సమయంలో కిరణ్‌కుమార్ తండ్రి లింగయ్య దాబాపైకి వెళ్లి చూడగా మూక పడియమి తెల్లటి టవల్‌తో ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడు అప్పుడప్పుడు వింతగా ప్రవర్తించేవాడని, ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియలేదని ముడ పడియమి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్ వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి