భువనగిరి పట్టణ కేంద్రంలో ఎన్నో ఏళ్ల నుండి పెన్షన్ కోసం ఎదురుచూస్తున్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి నియోజవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో మన హన్మాపురం గ్రామానికి చెందిన 57 మంది లబ్ధిదారులకు నూతన పెన్షన్లు మంజూరు కావడం జరిగింది. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ రావడానికి కారకులైన ఎమ్మెల్యే కి మన గ్రామ పెన్షన్ దారులు మరియు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిజెస్తున్నాము.ఇట్టి కార్యక్రంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ నాగపూరి సువర్ణ కృష్ణ, ఉపసర్పంచ్ మోర లింగారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు రాపాక కృష్ణ యాదవ్, సింగల్ విండో డైరెక్టర్ తుమ్మెటి వెంకటేశ్ యాదవ్, మండల నాయకులు గోమారి మహిపాల్ రెడ్డి, నాయిని గణేష్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారులు పాల్గొనడం జరిగింది.
ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే సహకారంతో నూతన పెన్షన్లు మంజూరు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి