హైదరాబాద్: నగరంలోని నార్సింగి ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పసిఫికా హిల్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. 12వ అంతస్తు నుంచి 18వ అంతస్తు వరకు మంటలు వ్యాపించడంతో అపార్ట్‌మెంట్ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీగా ఎగసిపడుతున్న మంటలతో అపార్ట్‌మెంట్ పరిసరాల్లో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు, ప్రాణనష్టం, ఆస్తినష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నార్సింగిలో భారీ అగ్నిప్రమాదం.. 12 నుంచి 18వ అంతస్తు వరకు వ్యాపించిన మంటలు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి