నల్లగొండ: చెత్త సేకరణ విషయంలో తలెత్తిన వివాదం ఓ మహిళా పారిశుద్ధ్య కార్మికురాలిపై దాడికి దారితీసింది. నల్లగొండ పట్టణంలోని 45వ వార్డు ప్రకాశం బజార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. చెత్త సేకరణ విషయంలో ఇంటి యజమానికి, పారిశుద్ధ్య కార్మికురాలు జానమ్మకు మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం.ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఇంటి యజమాని కర్రతో జానమ్మపై దాడి చేసినట్లు బాధితురాలు ఆరోపించింది. విధులు నిర్వహిస్తున్న మహిళా కార్మికురాలిపై దాడి చేయడంపై తోటి పారిశుద్ధ్య కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల పట్ల ఇలాంటి దాడులు జరగడం ఆందోళనకరమని పేర్కొన్నారు.దాడికి పాల్పడిన ఇంటి యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు జానమ్మ నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. విధులు నిర్వహించే పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కల్పించాలని కార్మికులు కోరుతున్నారు.
మహిళా పారిశుద్ధ్య కార్మికురాలిపై కర్రతో దాడి.. ఇంటి యజమానిపై చర్యలకు ఫిర్యాదు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి