Sthanikam - Truth Matters
Logo

దమ్ముంటే రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టుకో..

Updated : 19 Nov 2026 12:48 IST
As Preferred Source 1 min read
దమ్ముంటే రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టుకో..

రాజగోపాల్‌రెడ్డిపై డీసీసీ అధ్యక్షుడు కైలాష్ నేత తీవ్రస్థాయిలో ధ్వజం.

నల్గొండ: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారశైలి కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉందని జిల్లా డీసీసీ అధ్యక్షుడు కైలాష్ నేత తీవ్రస్థాయిలో విమర్శించారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీని వీడి కొత్త పార్టీ పెట్టుకోవాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్‌లో ఉంటూ పార్టీ నాయకత్వంపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, కొత్త పింఛన్లు అందించడం రాజగోపాల్‌రెడ్డికి ఇష్టం లేదా అని నిలదీశారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమ పథకాలతో పాటు ప్రాజెక్టుల పనులు ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.2014 నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను కింద పడేశారని, ఏనాడైనా పార్టీ కోసం, కార్యకర్తల భవిష్యత్తు కోసం మాట్లాడారా అని ప్రశ్నించారు. మంత్రి పదవి కేవలం కాంట్రాక్టర్ల కోసమేనా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజగోపాల్‌రెడ్డి వ్యవహారశైలి బీఆర్ఎస్, బీజేపీలతో కుమ్మక్కై సీఎం రేవంత్‌రెడ్డిపై తిరుగుబాటు చేస్తున్నట్లుగా కనిపిస్తోందని ఆరోపించారు.

పార్టీ అధిష్ఠానం ఎన్నాళ్లని ఓపిక పడుతుందని, రాజగోపాల్‌రెడ్డి తీరుపై అధిష్ఠానం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని కైలాష్ నేత స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు.

Sthanikam

దమ్ముంటే రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టుకో..

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news