Sthanikam - Truth Matters
Logo

తెలంగాణలో గుండాల, అవినీతి రాజ్యం నడుస్తోంది

Updated : 19 Nov 2026 16:42 IST
As Preferred Source 1 min read
తెలంగాణలో గుండాల, అవినీతి రాజ్యం నడుస్తోంది

రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై రాజాసింగ్ విమర్శలు.

తెలంగాణలో గుండాల రాజ్యం, అవినీతి రాజ్యం నడుస్తోందంటూ రాజాసింగ్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నిన్న కొన్ని వాస్తవాలను వెల్లడించేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు.గత బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులకు నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని, కమ్యూనికేషన్‌ గ్యాప్‌ కూడా లేదని అన్నారు. ఎప్పుడు నిధులు అడిగినా లేవని సమాధానం చెప్పిన సందర్భాలు లేవని పేర్కొన్నారు. అప్పటి ముఖ్యమంత్రి ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో పనిచేశారని తెలిపారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం తనతో సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేల నియోజకవర్గాలకే నిధులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. బంగారు తెలంగాణ సాధించాలంటే ప్రతి నియోజకవర్గంలో సమానంగా అభివృద్ధి జరగాలని, ఎమ్మెల్యేలు ఫోన్‌ చేసినా అధికారులు స్పందించకపోవడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. ఈ విధానాన్ని ముఖ్యమంత్రి మార్చుకోవాలని రాజాసింగ్‌ హితవు పలికారు.

Sthanikam

తెలంగాణలో గుండాల, అవినీతి రాజ్యం నడుస్తోంది

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి