Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సంగారెడ్డి

సీఎం సభకు సంగారెడ్డి నుంచి భారీగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు

Updated : 19 Nov 2026 17:53 IST
As Preferred Source 1 min read
సీఎం సభకు సంగారెడ్డి నుంచి భారీగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు

సిద్దిపేటలో గురువారం నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు సంగారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, రెండు మున్సిపాలిటీల పరిధిలోని వివిధ గ్రామాలు, పట్టణాల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి కాంగ్రెస్ శ్రేణులు సభకు బయలుదేరారు. ముందుగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు సంగారెడ్డి పట్టణంలోని ఐబీ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో ర్యాలీగా సిద్దిపేటకు పయనమయ్యారు. దీంతో ఐబీ ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సందడి నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో నియోజకవర్గంలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల నుంచి పార్టీ శ్రేణులు ఉత్సాహంగా తరలివెళ్లాయి. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, సంగారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనితా సంతోష్, కాంగ్రెస్ నాయకులు జార్జ్, కిరణ్ గౌడ్, కూన సంతోష్, మహేష్ ముదిరాజ్, శ్రీకాంత్ గౌడ్, అంకని ప్రవీణ్, సందీప్ రెడ్డి, వంశీ, రవి నాయక్, రమేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సీఎం సభకు సంగారెడ్డి నుంచి భారీగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి