Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

13వ వార్డు కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా చెవగొని వెంకటేష్ గౌడ్

Updated : 19 Nov 2026 18:08 IST
As Preferred Source 1 min read
13వ వార్డు కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా చెవగొని వెంకటేష్ గౌడ్

సంక్షేమ పథకాలను ప్రతి పేద కుటుంబానికి చేర్చాలి

​​చౌటుప్పల్‌ స్థానికం ప్రతినిధి:

పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా 13వ వార్డు కాంగ్రెస్‌ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని గట్టు శ్రీరాములు ఫంక్షన్‌ హాల్‌లో గురువారం పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో 13వ వార్డు నూతన అధ్యక్షుడిగా చెవగొని వెంకటేష్ గౌడ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.​ ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ పట్టణ అధ్యక్షుడు మొగుదాల రమేష్ గౌడ్‌, మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ గోశిక వినయ్‌కుమార్‌, వార్డు కౌన్సిలర్‌ బత్తుల వాణి విప్లవ్‌ మాట్లాడుతూ.. వార్డుల వారీగా కమిటీలు ఏర్పాటు చేసుకుని పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి చేరేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.​నూతన అధ్యక్షుడు చెవగొని వెంకటేష్ గౌడ్‌ మాట్లాడుతూ.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నాయకత్వంలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకంతో కీలక బాధ్యత అప్పగించిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.కార్యక్రమంలో 13వ వార్డు ఇన్‌ఛార్జి ఇప్ప వెంకటేష్, 12వ వార్డు కౌన్సిలర్‌ పాక చిరంజీవి, పట్టణ ఉపాధ్యక్షుడు వర్కల కుమార్‌గౌడ్‌, నాయకులు బండమీది మల్లేష్, ఎర్ర లింగస్వామి, ఎండీ వాహిదీన్‌, తోర్పునూరి నర్సింహగౌడ్‌, మొగుదాల రాములుగౌడ్‌, బొమ్మిరెడ్డి సంజీవరెడ్డి, తొర్పునూరి రవిగౌడ్‌, కోడి కృష్ణనేత, బొల్లోజు విశ్వరూపాచారి, సంగిశెట్టి రమేష్ నేత, తోర్పునూరి సాయిలు గౌడ్‌, గుయ్యని జంగయ్య, వర్కల జయరాం గౌడ్‌, మొగుదాల రాకేష్ గౌడ్‌, కళ్లెం నాగరాజుగౌడ్‌, చెవగొని గణేష్ గౌడ్‌, కరెంటోతు శ్రీకాంత్‌, చెవగొని శ్రావణ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

13వ వార్డు కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా చెవగొని వెంకటేష్ గౌడ్

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి