Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నిక.

Updated : 19 Nov 2026 18:24 IST
As Preferred Source 1 min read
మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నిక.

అధ్యక్షుడిగా దుబ్బాక శ్రీధర్ రెడ్డి.. ప్రధాన కార్యదర్శిగా లగ్గోని మహేష్ గౌడ్.

స్థానికం ప్రతినిధి:

తెలంగాణ గవర్నమెంట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ జిల్లా స్థాయి సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా దుబ్బాక శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా లగ్గోని మహేష్ గౌడ్, కోశాధికారిగా ఆర్. సుధాకర్, గౌరవ అధ్యక్షుడిగా శేష్ కుమార్ ఎన్నికయ్యారు.

ఈ సమావేశానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ముందడుగు ఉపేందర్ రెడ్డి, టీఎన్జీవో హెల్త్ ఫోరం అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి, కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ల సమస్యల పరిష్కారానికి, ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు, సంఘం అభివృద్ధికి నూతన కార్యవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు..

Sthanikam

మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నిక.

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి