మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బోడ్మట్ పల్లి వద్ద జాతీయ రహదారి 161 క్రాస్ సిగ్నల్ వద్ద రోడ్డు కారు ప్రమాదం చోటుచేసుకుంది.సంగారెడ్డి జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న ఫార్చునర్ కారు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.ఈ ఘటనలో డీసీసీ ప్రెసిడెంట్ ప్రమాదం నుండి తృటిలో బయటపడ్డారు.నారాయణ ఖేడ్ నుండి సంగారెడ్డి వైపు రెండు కార్లలో వెళ్తున్న డీసీసీ ప్రెసిడెంట్ కారు బోడ్మాట్ పల్లి వద్ద జాతీయ రహదారి క్రాస్ వద్ద ఎదురుగా వస్తున్న బైకును తప్పించే క్రమంలో రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న డీసీసీ స్వల్ప గాయాలతో బయటపడటంతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.వెంటనే రెండో కారులో చంద్రశేఖర్ రెడ్డి నారాయణఖేడ్ వెళ్లిపోయారు.
సంగారెడ్డి జిల్లా డిసిసి ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డికి త్రుటిలో తప్పిన ప్రమాదం
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి