Sthanikam - Truth Matters
Logo

చిట్యాలలో రాష్ట్ర మహిళా స్పీడ్ హ్యాండ్‌బాల్ జట్టు ఎంపిక పోటీలు

Updated : 18 Nov 2026 10:04 IST
As Preferred Source 1 min read
చిట్యాలలో రాష్ట్ర మహిళా స్పీడ్ హ్యాండ్‌బాల్ జట్టు ఎంపిక పోటీలు

చిట్యాల: పట్టణంలోని లయోలా టెక్నో స్కూల్ వేదికగా బుధవారం (నవంబర్ 18) మూడో తెలంగాణ రాష్ట్ర మహిళా స్పీడ్ హ్యాండ్‌బాల్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి నల్గొండ జిల్లా స్పీడ్ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.

జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు మంద వేణుగోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏలుగు చంద్రశేఖర్ పర్యవేక్షణలో ఈ పోటీలు జరగనున్నాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ వైష్ణవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ మహ్మద్ కబీర్, తెలంగాణ స్పీడ్ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సుబీర్ ఖాన్, రాష్ట్ర అధ్యక్షుడు డి. గురువేందర్, ప్రధాన కార్యదర్శి బి. పవన్ హాజరుకానున్నారు.

ఈ రాష్ట్రస్థాయి ఎంపిక పోటీల్లో తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాలకు చెందిన మహిళా క్రీడాకారిణులు, కోచ్‌లు, ఆయా జిల్లాల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు ఎంపికైన క్రీడాకారిణులు డిసెంబర్ 23 నుంచి 25 వరకు హిమాచల్ ప్రదేశ్‌లో జరగనున్న జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ టోర్నమెంట్‌లో తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.

మహిళా క్రీడాకారిణులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ప్రతిభను చాటాలని జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు మంద వేణుగోపాల్ రెడ్డి కోరారు.

Sthanikam

చిట్యాలలో రాష్ట్ర మహిళా స్పీడ్ హ్యాండ్‌బాల్ జట్టు ఎంపిక పోటీలు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి