ఉమ్మడి నల్లగొండ జిల్లా 70వ ఎస్జీఎఫ్ అండర్-19 అథ్లెటిక్స్ పోటీలు ఘనంగా నిర్వహణ...
ఉమ్మడి నల్లగొండ జిల్లా 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) అండర్-19 అథ్లెటిక్స్ క్రీడా పోటీలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎన్.ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన విద్యార్థులకు కళాశాల వైస్ ప్రిన్సిపాల్,ఎస్ఎల్ఎన్ఎస్ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ బి.పాండురంగం,పీడీ జి.ఐలయ్య ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బంగారు పతకాలు,ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ,పట్టుదల,ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.ఈ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విజేతలను ఈ సందర్భంగా అతిథులు, నిర్వాహకులు అభినందించారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి