ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన పింఛన్ల పంపిణీ
ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందిస్తాం: కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
రాష్ట్రంలో పేదలు, మహిళలు, దివ్యాంగులు, వృద్ధులు, కార్మికులకు అండగా నిలుస్తూ ప్రభుత్వం కొత్తగా 4,63,857 మందికి పింఛన్లు మంజూరు చేయడం ద్వారా లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించింది. ఈ సందర్భంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పాలన సాగిస్తోందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పేదవర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తోందని కొనియాడారు. నూతన పింఛన్ల మంజూరు ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించడం ఎంతో అభినందనీయమన్నారు.
మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి